Mother Suicide: మానసిక వికలాంగుడైన కొడుకు మృతితో తల్లి తల్లడిల్లిపోయింది. కొడుకుతో పాటే తనువు చాలించింది. అనారోగ్యంతో కొడుకు మృతిచెందడంతో కన్నతల్లి తట్టుకోలేక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏడు మాసాల క్రితం భర్త, ఇప్పుడు తల్లి కొడుకు… ఒకే ఇంట్లో ముగ్గురు మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.