సూర్యాపేట జిల్లా: ఇప్పటి వరకు గృహాజ్యోతి పథకంలో భాగంగా సున్నా బిల్లు పొందని లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం విద్యుత్ అధికారి నరసింహ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోందని,దీని ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నారన్నారు.

 Another Chance For Zero Electricity Bill Electricity Officer Narasimha Naik, Ze-TeluguStop.com

మొదట నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో లబ్ధిదారులు దరఖాస్తులు నమోదు సరిగా పూర్తి చేయక అర్హులై ఉండి కూడా పథకం ఫలాలు పొందలే కపోయారని,ఆపరేటర్లు ఆన్లైన్ ప్రక్రియ సరిగా చేయకపోవడం మరి కొందరు,

అవగాహన లేక ఆరు గ్యారెంటీలో కొన్నిటిని నమోదు చేసుకోకపోవడం ఇలా నమోదు చెయ్యని వారికి పథకం అమలులో నో అప్లికేషన్ అనే సమాచారం ఇచ్చిందని,అర్హులు అయ్యిండి కూడా 7 నెలలుగా గృహజ్యోతి పథకానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.ప్రభుత్వం మొదటి నుండి సవరణకు మాత్రమే అవకాశం ఇచ్చిందని, ఇప్పుడు నాట్ అప్లైని కూడా సవరించడానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

మండలంలో సుమారు 800 కుటుంబాలు అర్హులై ఉండి కూడా గృహజ్యోతి జీరో బిల్లు పొందడం లేదని, అలాంటివారు ఎంపీడీవో కార్యాలయంలో గృహ జ్యోతి దరఖాస్తును ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here