మహీంద్రా థార్ రాక్స్ వర్సెస్ మారుతి జిమ్నీ: స్పేస్ అండ్ కంఫర్ట్

రెండు ఎస్ యూవీలకు సరైన రెండో వరుస సీటింగ్ ను అందించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అడ్వెంటరిస్ట్ యొక్క ఆనందం కంటే ఫ్యామిలీ ఎస్ యూవీలుగా తమను తాము ప్రజెంట్ చేసుకోవడం. ఈ అంశంలో, స్థలం మరియు సౌకర్యం రెండు అత్యంత కీలకమైన పరామితులుగా మారతాయి. ప్రామాణిక థార్ తో పోలిస్తే థార్ రాక్స్ పరిమాణంలో పెరిగింది. ఇది ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. ఇది 4,428 మిమీ పొడవు, 1,870 మిమీ వెడల్పు, 1,923 మిమీ ఎత్తు, 2,850 మిమీ వీల్ బేస్ కలిగి ఉంది. దీని రోడ్ ప్రెజెన్స్ గొప్పగా ఉంది. కానీ, ఇరుకైన రోడ్లలో దీనితో ప్రయాణం కొంత కష్టం. అలాగే, ఇరుకైన ప్లేస్ ల్లో పార్క్ చేయడం కూడా కష్టం. పరిమాణం పెరగడం వల్ల థార్ రాక్స్ లోపల స్థలం పెరిగింది. ఇది రెండు అదనపు డోర్లను పొందడమే కాకుండా, సరైన రెండవ వరుస సీటింగ్ కు వీలు కల్పిస్తుంది. రెండో వరుస సీట్లలో మూడు హెడ్ రెస్ట్ లు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, పొడవైన ప్రయాణీకులకు తొడ కింద సపోర్ట్ లేదు. థార్ రాక్స్ తో పోలిస్తే, జిమ్నీ రోడ్ ప్రెజెన్స్ కొంత తక్కువ. ఈ ఎస్ యూవీ పొడవు 3,820 ఎంఎం, వెడల్పు 1,645 ఎంఎం, ఎత్తు 1,720 ఎంఎం, వీల్ బేస్ 2,590 ఎంఎంగా ఉంది. చిన్న పరిమాణం ఉన్నప్పటికీ, భారీ నగర ట్రాఫిక్, ఇరుకైన మార్గాలు లేదా చిన్న పార్కింగ్ స్థలాలు ఉన్నవారికి జిమ్నీ మంచి ఎంపిక అవుతుంది. మారుతి సుజుకి జిమ్నీలో రెండవ వరుస సీట్లకు ఎటువంటి ఆర్మ్ రెస్ట్ ఉండదు. జిమ్నీలో కేవలం ఇద్దరు మాత్రమే సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. రెండు ఎస్యూవీల మధ్య కామన్ గా కనిపించేది వెనుక ప్రయాణీకులకు బాటిల్స్ లేదా ఇతర వస్తువులను నిల్వ చేయడానికి స్థలం లేకపోవడం. రెండు ఎస్ యూవీల్లో ఇరువైపులా ఉన్న డోర్ ప్యాకెట్స్ లో స్మార్ట్ ఫోన్ తప్ప వేరేదీ పెట్టలేము. థార్ రోక్స్ లోపల ఉన్న ఆర్మ్ రెస్ట్ కు చిన్న సైజ్ కప్ హోల్డర్లు ఉన్నాయి. లాంగ్ వీకెండ్ ట్రిప్ అయితే, థార్ రాక్స్ జిమ్నీ కంటే బూట్ స్పేస్ లో ఎక్కువ లగేజీకి వీలు కల్పిస్తుంది. థార్ రాక్స్ లోపల 600 లీటర్లకు పైగా స్థలం ఉంది. వెనుక సీట్లను మడతపెట్టే సౌలభ్యం వల్ల బూట్ స్పేస్ మరింత పెరుగుతుంది. జిమ్నీ కేవలం 211 లీటర్ల బూట్ స్పేస్ ను అందిస్తుంది, ఇది వెనుక సీట్లను మడిస్తే 332 లీటర్ల వరకు వెళ్ళవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here