చిన్నప్పటి నుంచి సినిమా(cinema)మీద పెంచుకున్న ఇష్టంతో  నిత్యం ఎంతో మంది సినీ పరిశ్రమలో సెటిల్ అవ్వాలని  అడుగుపెడుతూ ఉంటారు. కానీ తాము అనుకున్న లక్ష్యాన్ని చేరే క్రమంలో తొందరపాటుకి గురయ్యి అకాలమరణాన్ని ఆహ్వానిస్తారు. కాబోయే ఒక యువ దర్శకుడి  మరణం కూడా ఈ కోవలోకే వస్తుంది.

ఈర్ల  వెంకట్రావు.. దర్శకుడుగా తన సత్తా చాటాలని చాలా ఏళ్ళ క్రితమే ఇండస్ట్రీలోకి  ప్రవేశించాడు. సినీ పెద్దలకి పరిచయం అవ్వాలనే ద్యేయంతో  అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తు సంబంధిత యూనియన్ లో కార్డుని కూడా పొందాడు.  ఇక  కొంత కాలం నుంచి  సొంతంగా స్టోరీస్ రాసుకొని  పలు నిర్మాతల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఎక్కడ కూడా అవకాశం రాకపోవడంతో ఈ రోజు ఉదయం  సూసైడ్ చేసుకొని చనిపోయాడు.

ఈ వార్తతో సినిమా ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి లోనయ్యింది. కొన్ని రోజుల పాటు ఓపిగ్గా ఉండి ఉంటే అవకాశాలు వచ్చేవని  తోటి సినీ కార్మికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనీ ప్రాబ్లమ్స్ తో పాటు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుండటం కూడా సూసైడ్ కి మరో కారణం అని తెలుస్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here