గాయంతోనే ఆస్ట్రేలియాపై సెంచరీ

2019 వన్డే వరల్డ్‌కప్‌లోనూ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగే వరకూ అతని జోరు కొనసాగింది. ఆ మెగా టోర్నీలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గబ్బర్ రెండో మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు. చివరికి ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో వేలికి తీవ్ర గాయమైనా నొప్పిని పంటి బిగువన భరిస్తూ 117 పరుగులు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్ దూకుడుకి కళ్లెం వేయలేక ప్రత్యర్థి జట్లు అతడ్ని ఔట్ చేయలేక తలలు పట్టుకునేవి. పవర్ ప్లే నుంచే బాదుడు మొదలెట్టే శిఖర్ ధావన్.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్లు మార్చుకుంటూ వెళ్లేవాడు. దాంతో ప్రత్యర్థి బౌలర్లకీ చిక్కులు తప్పేవి కావు. దాదాపు ఆరేళ్ల పాటు ఐసీసీ టోర్నీల్లో గబ్బర్ హవా కొనసాగింది.

2022 చివర్లో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ రూపంలో యంగ్ ఓపెనర్ల రాకతో శిఖర్ ధావన్‌కి కష్టాలు మొదలయ్యాయి. ఫామ్ కోల్పోవడం, ఫిట్‌నెస్ అతని కెరీర్‌ను దెబ్బతీసింది. దాంతో భారత్ జట్టు నుంచి అతనికి పిలుపు కరువైంది. గత రెండేళ్లుగా భారత సెలెక్టర్ల పిలుపు కోసం అతను ఎదురుచూసి చివరికి నిరాశగానే గుడ్ బై చెప్పేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here