లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో రైజింగ్‌ హ్యాండ్స్‌ ప్రొడక్షన్స్‌ పి.పార్థసారథి, డి.నాగేంద్రరెడ్డి, కృష్ణచంద్ర విజయబట్టు నిర్మాతలుగా డి.నాగశశిధర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సీతారాం సిత్రాలు’. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఆకాష్‌ జగన్నాథ్‌ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా హీరో ఆకాష్‌ జగన్నాథ్‌ మాట్లాడుతూ : తెలుగు ప్రేక్షకులు సినిమా నచ్చితే తమ భుజాల పైన వేసుకుని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఇండస్ట్రీ కూడా మన తెలుగు ప్రేక్షకుల వైపే చూస్తుంది. సినిమా బాగుంటే పెద్ద విజయాన్ని అందిస్తారు. ఈ సినిమా కూడా అందరూ చూసి ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ : సీతారాం సిత్రాలులో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇది తమ సొంత సినిమా లాగా కష్టపడి పని చేశారు. ఈ సినిమా డిజిటల్‌ గా ట్రైలర్‌ లాంచ్‌ చేసిన డైరెక్టర్‌ మారుతిగారికి, రెండు పాటల్ని విడుదల చేసిన హీరో విశ్వక్సేన్‌గారికి, హీరో సందీప్‌ కిషన్‌గారికి కృతజ్ఞతలు. చిన్న సినిమా అయిన సపోర్ట్‌ ఇస్తున్న హీరో కార్తికేయగారికి కృతజ్ఞతలు. ట్రైలర్‌ లాంచ్‌ చేసి మమల్ని సపోర్ట్‌ చేస్తున్న ఆకాష్‌ జగన్నాథ్‌గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రేక్షకులు అందరూ ఈ చిన్న సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాము అన్నారు.

డైరెక్టర్‌ డి.నాగ శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ : ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి వచ్చి సపోర్ట్‌ చేస్తున్న ఆకాష్‌ జగన్నాథ్‌గారికి కృతజ్ఞతలు. జంధ్యాల, ఈవివి సత్యనారాయణ, రేలంగిగార్ల సినిమాలు ఎక్కువ చూశాను. మా ఈ సీతారాం సిత్రాలు సినిమా కూడా అలాంటి స్ట్రెస్‌ రిలీఫ్‌ సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here