వారం క్రితం నేపాల్ లో..

నేపాల్ (Nepal) రాజధాని ఖాట్మండుకు వాయవ్యంగా ఉన్న పర్వతాల సమీపంలో ఆగస్టు 7న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు పురుషులు, ఒక మహిళ మృతి చెందారు. శిథిలాల నుంచి నలుగురు పురుషులు, ఒక మహిళ మృతదేహాలను వెలికితీశామని నువాకోట్ జిల్లా ప్రభుత్వ అడ్మినిస్ట్రేటర్ కృష్ణ ప్రసాద్ హుమగై తెలిపారు. పోలీసులు, ఆర్మీ రెస్క్యూ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారని, ఆపరేషన్లో సహాయపడటానికి రెండు రెస్క్యూ హెలికాప్టర్లను కూడా పంపినట్లు అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక కాలమానం ప్రకారం ఆగస్ట్ 7వ తేదీ మధ్యాహ్నం 1.54 గంటలకు ఖాట్మండు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సప్రుబేషి పట్టణానికి ఆ చాపర్ వెళ్తోంది. నేపాల్ లోని ఎయిర్ డైనాస్టీ కి చెందిన యూరోకాప్టర్ ఏఎస్ 350 హెలికాప్టర్ టేకాఫ్ అయిన మూడు నిమిషాల్లోనే టవర్ తో సంబంధాలు తెగిపోయాయి. ఇటీవల మే 20న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్ బైజాన్ దేశ సరిహద్దులోని జోల్ఫా నగరం సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, పొగమంచు, గాలులు హెలికాప్టర్ ప్రమాదానికి కారణమయ్యాయని, కొందరు దీనిని హార్డ్ ల్యాండింగ్ గా అభివర్ణించారని స్థానిక మీడియా పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here