మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆల్‌టైమ్‌ హిట్‌ ‘ఇంద్ర’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే రీ రిలీజ్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా తన దూకుడును చూపించింది. మెగా ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఉత్సాహంగా సినిమాను చూశారు. ‘అయ్యయ్యయ్యో..’ పాటకు స్క్రీన్‌ ముందు అమ్మాయిలతోపాటు ఒక అంకుల్‌ వేసిన స్టెప్స్‌కి ఫ్యాన్స్‌ కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేశారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. రిలీజ్‌ అయి 22 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంద్ర సినిమాకి ఇప్పటికీ క్రేజ్‌ తగ్గలేదంటే అది మెగాస్టార్‌ స్టామినా అంటూ అభిమానులు ఎంతో హ్యాపీగా చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మెగా ఫ్యాన్స్‌ తమకు అనుకూలంగా మార్చుకొని బన్నీని విమర్శించడానికి వాడుకున్నారు. చిరంజీవికి శివాజీ వెన్నుపోటు పొడిచే సీన్‌ రాగానే ఫ్యాన్స్‌ అంతా ‘బన్నీ..’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ సౌండ్‌తో థియేటర్‌ మారుమోగిపోయింది. ప్రజెంట్‌ సిట్యుయేషన్‌కి ఆ సీన్‌ బాగా సింక్‌ అవ్వడం యాదృశ్చికమే. అయినా ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోతోంది. అయితే ఈ వీడియోలపై బన్నీ ఫ్యాన్స్‌ కూడా రియాక్ట్‌ అవుతున్నారు. ఇంతకాలం బన్నీ ఫ్యాన్స్‌, మెగా ఫ్యాన్స్‌ మధ్య వార్‌ సోషల్‌ మీడియాకే పరిమితమైంది. ఇంద్ర రీ రిలీజ్‌ సందర్భంగా అది ప్రత్యక్ష పోరుగా మారింది. కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ మెగా ఫ్యాన్స్‌తో బన్ని విషయాన్ని ప్రస్తావిస్తూ ‘అల్లు అర్జున్‌ మెగా కాంపౌండ్‌ నుంచి బయటికి వచ్చేసే ఆలోచనలో ఉన్నారట..’ అనగానే ‘వచ్చెయ్యనివ్వండి. హ్యాపీ కదా. మాకెందుకండీ.. వాడి సినిమాలకు ఫ్లెక్సీలు కట్టి అవీ ఇవీ చెయ్యడం మాకే బొక్క కదా.. మానేస్తాం. బయటికి వచ్చెయ్యమనండి.. అందులో ఇబ్బంది ఏముంది.. నో ఇష్యూ’ అన్నారు. 

హీరోలందరికీ ఫ్యాన్స్‌ ఉంటారు, తనకు ఆర్మీ ఉందని బన్నీ అంటుంటారు కదా అని అడిగితే.. దానికి మెగా ఫ్యాన్స్‌ అంతా గొల్లున నవ్వుతూ ‘ఆర్మీ ఉందండీ. ఇప్పుడే స్కూల్‌కి వెళ్ళారు. సాయంత్రం వచ్చేస్తారు..’ అంటూ ఆ విషయాన్ని కామెడీగా తీసి పారేశారు. మెగాస్టార్‌ పుట్టినరోజుకి ఏం చెయ్యబోతున్నారని అడిగినపుడు ‘ఇప్పుడు సినిమా అయిపోయింది కదా.. డైరెక్ట్‌గా బ్లడ్‌ బ్యాంక్‌కి వెళ్తాం. బ్లడ్‌ ఇస్తాం. అన్నయ్య ఆ సంస్కారమే మాకు నేర్పాడు. మమ్మల్ని వాళ్ళు కెలుకుతారు కాబట్టి నాలుగు మాటలు మాట్లాడతాం తప్ప మా సంస్కారం అది కాదు. బ్లడ్‌ ఇవ్వండి, నలుగురికి అన్నం పెట్టండి.. ఇదే నేర్పాడు అన్నయ్య. ఆ ఫ్లోలోనే వెళ్లిపోతాం’ అంటూ సమాధానమిచ్చారు మెగా ఫ్యాన్స్‌.  ఇదిలా ఉంటే.. చిరు పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఆయనకు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. దానికి చిరు కూడా థాంక్స్‌ చెప్పారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here