సాధారణంగా కంప్యూటర్ లాంగ్వేజెస్( Computer Languages ) ఇంగ్లీష్ భాషలో ఉంటాయి.తెలుగులో కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని భావించినా సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.

 Joindevops Shivakumar Inspirational Success Story Details, Shivakumar Reddy, Joi-TeluguStop.com

పది, ఇంటర్ లో టాపర్లుగా ఉన్నా ఇంగ్లీష్ లో అనర్ఘళంగా మాట్లాడటం సాధ్యం కాక ఎంతోమంది తమ లక్ష్యాలను సాధించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.నెల్లూరు కుర్రాడు శివకుమార్ రెడ్డి( Shivakumar Reddy ) సరైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఒకప్పుడు ఇబ్బందులు పడ్డారు.

తర్వాత రోజుల్లో ప్రోగ్రామింగ్ పై( Programming ) పట్టు సాధించిన శివకుమార్ రెడ్డి అచ్చ తెలుగులో ఐటీ పాఠాలను చెప్పే జాయిన్ డెవాప్స్( Join DevOps ) సంస్థను స్థాపించారు.ఈ సంస్థ ద్వారా ఎంతోమందికి ఉపాధి చూపుతూ శివకుమార్ రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నారు.

సాఫ్ట్ వేర్ రూపకల్పనకు డెవాప్స్ సిస్టమ్ ఎంతో ముఖ్యం కాగా 25 వేలు ఫీజు కట్టి లైవ్ ప్రాజెక్ట్స్ నేర్చుకున్న విద్యార్థులు సులువుగా ఉద్యోగాలు సాధిస్తున్నారు.

నెల్లూరు( Nellore ) దగ్గర్లోని కలువాయి శివకుమార్ స్వస్థలం కాగా శివకుమార్ తండ్రి సన్నకారు రైతు కావడం గమనార్హం.కర్నూలులో బీటెక్ చదివిన శివకుమార్ ప్రముఖ కంపెనీలో జాబ్ సాధించినా ప్రోగ్రామింగ్ పట్టు లేక మొదట ఇబ్బంది పడినా జావా హెడ్ ఫస్ట్ బుక్ తో తన జీవితం మారిపోయిందని చెబుతున్నారు.ఖాళీగా ఉన్న సమయంలో తెలుగులో ఐటీ పాఠాలను యూట్యూబ్ లో చెప్పేవాడినని ఆయన తెలిపారు.

తమ సంస్థ ఆదాయం ప్రస్తుతం మూడు కోట్ల రూపాయలు అని శివకుమార్ చెప్పుకొచ్చారు.మిగతా ఎడ్ టెక్ కంపెనీలతో పొల్చి చూస్తే తమ కంపెనీ ఫీజులు సైతం తక్కువని శివకుమార్ చెబుతున్నారు.అతని సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు అతని సక్సెస్ స్టోరీని ఎంతగానో మెచ్చుకుంటున్నారు.శివకుమార్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here