Power Outages In Telangana : విద్యుత్ అంతరాయాలపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బల్లులు, పిల్లులు, పావురాలు, ఉడుతలు, చిన్న పక్షుల కారణంగా విద్యుత్ అంతరాయాలు తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్జీ ఫ్యూజ్ సెట్లలో సిలికాన్ క్లాంపులు ఉపయోగిస్తుంది.