మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas) తన 50వ చిత్రాన్ని జితిన్ లాల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా రూపొందించబడింది.

ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు వివిధ భాషల్లో విడుదల చేశారు. టీజర్ కు మంచి స్పందన లభించింది. పొడవాటి జుట్టుతో టొవినో థామస్ ఒక కఠినమైన అవతార్‌ను ప్రదర్శించడం చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ విభిన్న కాన్సెప్ట్ తో, విజువల్ వండర్ లా ఉంది. 

మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ మరియు లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ నంబియార్ కథను అందించారు. ఈ చిత్రానికి దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here