కొన్ని రోజుల క్రితం  పవన్ కళ్యాణ్(pawan kalyan)మాట్లాడుతు  ఒకప్పుడు అడవులని కాపాడే వాళ్ళని  హీరో అనే వాళ్ళు. ఇప్పుడు అడవులని  దోచుకునే వారిని హీరో అంటున్నామని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఎలక్షన్స్ టైం లో   అల్లు అర్జున్ (allu arjun)నంద్యాల వెళ్లడం వల్లనే  పవన్  ఆ వ్యాఖ్యలు చేసాడని అల్లు ఆర్మీ అనడం, రివర్స్ గా మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వడం లాంటివి జరిగాయి. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా కూడా బన్నీ ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతు నాకు నచ్చితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నచ్చిన వారి కోసం  వెళ్తానని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యల పై కూడా  మెగా ఫ్యాన్స్ గట్టిగానే  రిప్లై  లు ఇస్తున్నారు. ఈ క్రమంలో  లేటెస్ట్ గా అల్లు అర్జున్ మామ కంచర్ల  చంద్రశేఖర్ రెడ్డి(chandrasekhar reddy) కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. 

ఒక చానల్‌లో  చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతు  అల్లు అర్జున్ కేవలం నటుడిగానే  స్మగ్లింగ్ పనులు చేస్తున్నాడు. ఒక వేళ నిజ జీవితంలో  స్మగ్లింగ్  వ్యాపారం చేస్తే తప్పుపట్టాలి.ఈ విషయంపై పవన్ కి  నేను చేసే విన్నపం ఒకటే. పవన్ పెద్ద మనసుతో నా మాటల వెనుక ఉద్దేశం అల్లు అర్జున్ గురించి కాదని చెప్పాలి. అలా చెప్తే  వివాదానికి తెరపడుతుంది. ఒకవేళ పవన్  తన మాటలను వెనక్కి తీసుకోకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినట్టే.ఎందుకంటే భారత ప్రభుత్వమే  అల్లు అర్జున్ కి  జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాగే  చాలా మంది ఫోన్లు చేసి పవన్  అలా అనడం ఏమిటని  అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పాడు.  

 

ఇక నాగబాబు(naga babu) వ్యాఖ్యలపై కూడా మాట్లాడుతు  ఆయన ఏదో ఫ్రస్టేషన్‌తో అని ఉంటారు. ఆంధ్రాలో ఓ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొన్నారు. అయితే వ్యతిరేక పార్టీలకు చెందిన వారిని కూడా మనవాళ్లే అనుకోవాలి. వారి కోసం కూడా పనిచేయాలి అని చంద్రశేఖర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ప్రస్తుతానికి అయితే  బన్నీ మామ వ్యాఖ్యలు ఒక రేంజ్ లోనే  వైరల్ అవుతున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here