యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం మునిపంపుల నుండి లక్ష్మాపురం వరకు అధ్వాన్నంగా మారిన మట్టి రోడ్డుపై బిటి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మునిపంపుల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.సిపిఎం గ్రామ శాఖ నాయకులు, గ్రామ ప్రజలు దీక్షలో కూర్చున్నారు.

 Relay Hunger Strikes Under Cpm For Bt Road, Relay Hunger Strikes ,cpm ,bt Road,-TeluguStop.com

ఈ సందర్బంగా సిపిఎం రామన్నపేట మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ నిత్యం వందలాది మంది నడిచే రోడ్డు పట్ల ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం తగదన్నారు.గుంతలమయంగా మారి బోటిమీదగూడం ప్రజలు, రైతులు,వృత్తిదారులు నడవలేని పరిస్థితి నెలకొన్నదని,అనేక సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే పాలకులు చోద్యం చూస్తూ సమస్య పరిష్కారం చేయడం లేదన్నారు.

గత ప్రభుత్వం మనఊరు-మన ప్రణాళిక అంటూ గొప్పలు చెపితే,ప్రజా పాలన అంటూ ఇప్పటి ప్రభుత్వం ప్రచార ఆర్బాటాలే తప్ప చేసేదేమీ లేదని విమర్శించారు.గ్రామాల సమస్యలపై పరిష్కార మార్గం చూపని ప్రభుత్వాలు ఎవరి కోసం పని చేస్తున్నాయని ప్రశ్నించారు.

సమస్య తీవ్రంగా ఉండి అనేకమంది ఇబ్బందులు పడుతున్నందున స్థానిక ఎమ్మెల్యే స్పందించి రోడ్డు నిర్మాణం కోసం నిధులు విడుదల చేసేందుకు కృషి చేయాలని కోరారు.లేని పక్షంలో ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి తొలుపునూరి శ్రీనివాస్, నాయకులు ఉండ్రాతి నర్సింహ్మ,గునుగుంట్ల సత్యనారాయణ,జోగుల శ్రీనివాస్,పులిపలుపుల నాగార్జున,తాళ్ళపల్లి జితేందర్,చంద్రశేఖర్,నోముల రమేష్,జంపాల ఉమాపతి,తుర్కపల్లి నరేష్,పోగుల ఉపేందర్, బత్తిని సందీప్,ఉయ్యాల కిష్టయ్య,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here