సూర్యాపేట జిల్లా:ఐదు సంవత్సరాలు వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులకు( journalists ) ఎటువంటి ఆంక్షలు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించిన అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్రిడిటేషన్ల విషయంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,చాలా అవకతవకలు జరుగుతున్నాయని,ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని వర్క్ లో ఉన్న వారికి మాత్రమే సర్వే నిర్వహించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.

 Accreditation Should Be Given Without Restrictions To Journalists Who Have Been-TeluguStop.com

అంతేకాకుండా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఇంటి స్థలం, లేదా ప్రత్యేక ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు

.అదేవిధంగా ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు( working journalists ) ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు,ప్రతిరోజు లీటర్ పెట్రోల్,ఉచిత విద్యుత్,పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సలహాదారులు కొలిశెట్టి రామకృష్ణ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొండ శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ సోహెల్, అసోసియేషన్ నాయకులు మహమ్మద్ షరఫ్,హలీం పాషా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here