రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో గల కట్ట మైసమ్మ దేవాలయంలోపూజలు నిర్వహించడం జరిగింది.రవి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత ఎమ్మెల్సీ కవితమ్మ కి సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

 Kancharla Ravi Goud, The State Leaders Of Bharasa Student Union, Paid The Bills-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పండగ దినము అని అన్యాయంగా అక్రమంగా పెట్టిన ఈ డి.సిబిఐ పెట్టిన కేసులు ఎదుర్కొని 164 రోజులు జైలు జీవితాన్ని అనుభవించేలా చేసి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దామని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన చివరకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చెప్పినట్లుగానే కడిగిన ముత్యంల జైలు నుండి బయటికి వస్తారని చెప్పడం ఎలా జరిగిందో అలానే ఈరోజు ఉన్నత న్యాయస్థానంలో కవితమ్మ కి బెయిలు మంజూరు కావడం జరిగిందని.ఇలాంటి బెదిరింపులు ఇట్లాంటి ఇబ్బందులు తెలంగాణ ఉద్యమంలోనే కవితమ్మ చూశారని చెప్పడం జరిగింది.100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని అక్రమంగా అరెస్టు చేసి 493 మందిని విచారించి 50వేల పైగా పత్రాలను సమర్పించిన ఆరోపణను ఏమాత్రం రుజువు చేయలేకపోయాయని చివరికి ధర్మమే గెలిచిందని హర్షం వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, నాయకులు కోడం వెంకటేష్, వావిలాల సాయి, శ్రీనివాస్, మూడం సాయి, కోడి రోహిత్ సాయి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here