మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan)ఉపాసన (upasana)ల ముద్దుల కూతురు క్లీంకార(kiln kaara)గురించి  తెలియని వాళ్ళు ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఫేస్ చూపించకుండానే ఫుల్ పాపులర్  అయ్యింది. మెగా ఫ్యాన్స్ కైతే అభిమాన కిడ్.  ఇప్పుడు  లేటెస్ట్ గా  క్లీంకార కి సంబంధించిన కొన్ని ఫోటోలు  సోషల్ మీడియాలో సందడి  తెస్తున్నాయి.

ప్రతి ఫెస్టివల్ కి  క్లీంకార పిక్స్ ని  చరణ్ ఉపాసనలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.ఈ కోవలోనే  నిన్న జరిగిన కృష్ణాష్టమి పండుగ పిక్స్ ని కూడా షేర్ చేసారు.  ఉపాసన  తన ఎక్స్ వేదికగా  పూజ గదిలో ఉన్న ఫోటోలు షేర్ చేస్తు అమ్మ కారా ఇద్దరు పూజ చేసుకునే సమయం అనే  క్యాప్షన్ ని  ఇచ్చింది. అలాగే మరో ఫోటోని కూడా  షేర్ చేస్తు మా పూజలో నాన్న ,రైమ్ అనే క్యాప్షన్ ని ఉంచింది. రైమ్ అంటే పెంపుడు  కుక్క పేరు.  

ఇక చరణ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు  క్లీంకార కి ఒక గుర్రపు పిల్లని బహుమతిగా ఇచ్చాను. అంతటితో ఊరుకోకుండా  గుర్రపు స్వారీ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. దాంతో మా ఇద్దరి అభిరుచులు ఒక్కటే అని కూడా అర్దమయ్యిందని చెప్పుకొచ్చిన  విషయం అందరకి తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here