ఈ స్కామ్ ఇలా బయటపడింది

ఈ ముంబై వాసి లాభదాయకమైన పెట్టుబడి చిట్కాలను అందించే “విదేశీ నిపుణులు” నడుపుతున్న వాట్సాప్ గ్రూపులో చేరాడు. గణనీయమైన లాభాలను త్వరగా సంపాదించడానికి వ్యూహాలను అందిస్తామని ఆ గ్రూప్ పేర్కొంది. గ్రూప్ క్రెడెన్షియల్స్, కమ్యూనికేషన్స్ కు ఫిదా అయిన ఆ వ్యక్తి గ్రూప్ లో జరిగే చర్చల్లో చురుకుగా పాల్గొన్నాడు. ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న మొబైల్ యాప్ ను ఉపయోగించి ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసి వారు ఈ వ్యక్తిని మోసగించారు. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ ప్రారంభించేందుకు రూ.90 లక్షలను బ్రోకర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని వారు బాధితుడికి సూచించారు. ఆ వర్చువల్ ట్రేడింగ్ ఖాతాలో అతడికి మొదట్లో రూ.15.69 కోట్ల లాభాన్ని ఆ మోసగాళ్లు చూపించారు. అయితే బాధితుడు డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, విత్ డ్రా చేయడం వీలు కాలేదు. వాట్సాప్ గ్రూప్ లో ఆ మోసగాళ్లకు సంప్రదిస్తే, అదనంగా రూ.1.45 కోట్లను 10 శాతం ‘ప్రాఫిట్ షేరింగ్’ ఫీజుగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దాంతో, రూ. 90 లక్షలు మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here