‘అంటే సుంద‌రానికీ’ వంటి రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ఆగస్టు 29న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు ఆకట్టుకొని, సినిమాపై అంచనాలు పెంచాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.

‘సరిపోదా శనివారం’ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అభ్యంతరకమైన ఒక పదాన్ని మ్యూట్ చేశారు. ఈ మూవీ రన్ టైంని 174 నిమిషాల 37 సెకన్లు(2 గంటల 54 నిమిషాల 37 సెకన్లు)గా టీం లాక్ చేసింది. అంటే దాదాపు మూడు గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలో అడుగుపెడుతోంది. నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన గత చిత్రం ‘అంటే సుంద‌రానికీ’ కూడా ఇంచుమించు ఇదే నిడివితో వచ్చింది. అయితే ఆ అధిక నిడివి కారణంగానే.. ఆ సినిమా ఆశించినస్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందనే అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు ‘సరిపోదా శనివారం’కి కూడా దాదాపు మూడు గంటల నిడివి లాక్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఇది గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ అని, ఎక్కడా బోర్ కొట్టకుండా రన్ అవుతుందని.. కాబట్టి నిడివి అసలు సమస్యే కాదని అంటున్నారు. సెన్సార్ టాక్ కూడా అదే చెబుతోంది. మూవీ అవుట్ పుట్ బాగుందని, నాని-వివేక్ కాంబో మంచి హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here