ప్రస్తుతం ప్రేక్షకులందరి దృష్టి సెప్టెంబర్ 27న విడుదల కానున్న ‘దేవర’ (Devara)పై ఉంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, రెండు సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదలకు ఇంకా నెలరోజులు కూడా లేకపోవడంతో.. మూవీ టీం వరుస సర్ ప్రైజ్ లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

‘దేవర’ థర్డ్ సింగిల్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 6 లేదా 7న రిలీజ్ చేయనున్నారని సమాచారం. ‘దేవర’ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. ఫస్ట్ సింగిల్ గా ‘ఫియర్ సాంగ్’, సెకండ్ సింగిల్ గా ‘చుట్టమల్లే సాంగ్’ విడుదలై.. ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా రికార్డు వ్యూస్ తో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు రానున్న థర్డ్ సింగిల్.. ఆ రెండింటిని మించి అనేలా ఉంటుందట. అంతేకాదు ఈ సాంగ్ లో ఎన్టీఆర్ డ్యాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందట. దేవరలో రెండు పాటల్లో ఎన్టీఆర్ డ్యాన్స్ అదిరిపోతుందని, అందులో ఒకటి ఈ సాంగ్ అని సమాచారం. (Devara Third Single)

ఇక ‘దేవర’ ట్రైలర్ కి కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13 లేదా 14న ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ట్రైలర్ కట్ పూర్తయిందని, ట్రైలర్ విడుదల తర్వాత.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయమని చెబుతున్నారు. (Devara Trailer)

థర్డ్ సింగిల్, ట్రైలర్ కిక్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కి.. సరిగ్గా సినిమా విడుదలకు వారం ముందు మరో బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 20 కి ఒకరోజు అటుఇటుగా.. ఫోర్త్ సింగిల్ గా ‘ఆయుధపూజ సాంగ్’ని రిలీజ్ చేయనున్నారట. ఈ సాంగ్ విడుదల తర్వాత ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. దేవర రికార్డు ఓపెనింగ్స్ రాబడుతుంది అనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here