Nuzvid IIIT Students : ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత మూడు రోజులుగా సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా ట్రిపుల్ ఐటీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని, తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనలపై కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం చెబుతోంది. విద్యార్థులను స్థానికంగా పలు ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ మెస్‌లలో ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వల్లే విద్యార్థులు అనారోగ్యం బారినపడుతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here