శాఖాహారం అయితే హిందూ మీల్..

తమ విమానాల్లో శాకాహార భోజనాన్ని ‘హిందూ మీల్’ అని, మాంసాహారం అయితే ‘ముస్లిం మీల్’ అని ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నిస్తూ, ఎక్స్ లో జర్నలిస్ట్ ఆర్తి టికూ సింగ్ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కు విస్తారాను, పౌర విమానయాన శాఖను ట్యాగ్ చేశారు. హిందువులంతా శాకాహారులని, ముస్లింలంతా మాంసాహారులని ఎవరు చెప్పారని ఆమె విమానయాన సంస్థను ప్రశ్నించారు. ‘‘మతం ప్రాతిపదికన ఆహార ఎంపికలను ప్రజలపై ఎందుకు రుద్దుతున్నారు? ఇలా చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు’’ అని ఆమె ప్రశ్నించారు. విమాన ప్రయాణీకులను కూడా మత ప్రాతిపదికన చూస్తున్నారా? అని అడిగారు. విమానంలో భోజనాలకు సంబంధించిన ఆ ఫుడ్ కోడ్స్ ను చూసి తాను చాలా షాక్ అయ్యానని, మీ తీరును ధిక్కరించడానికి తాను రెండు భోజనాలను బుక్ చేసుకున్నానని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here