ప్రభాస్(prabhas)సాహూ మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్  భామ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor)ప్రెజంట్ హిందీ చిత్ర సీమలో ఉన్న నంబర్ వన్ హీరోయిన్స్ లో ఒకటి కూడా. రీసెంట్ గా స్త్రీ 2(stree 2)తో ఆల్ ఓవర్ ఇండియా అదరగొడుతుంది. అగస్ట్ 15 న వచ్చిన ఆ మూవీ ఇప్పటికే 400 కోట్ల మైలురాయిని కూడా అందుకుంది. దీంతో  లాస్ట్ ఫిగర్  చెప్పడం కష్టంగా కూడా మారింది. మరి అంతటి భారీ హిట్ ని అందుకున్న శ్రద్ద తన  పర్సనల్ న్యూస్ తో సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 

ముంబై లోని జూహూ  ఏరియా వెరీ వెరీ బిగ్ షాట్స్ ఉండే ఏరియా. ఇక్కడ ఉన్న ఒక ఖరీదైన అపార్ట్మెంట్స్ సముదాయంలో  స్టార్ హీరో  హృతిక్ రోషన్ కి ఒక ఇల్లు ఉంది. బీచ్ ఎదురుగా ఉండే ఆ బిల్డింగ్ లో మరో  స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి కూడా  ప్లాట్  ఉంది. అసలు విషయానికి వస్తే ఇప్పుడు హృతిక్ రోషన్ ఇంట్లో శ్రద్ద అద్దెకి దిగబోతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఆమె ఇల్లు మారడానికి ఒక కారణం ఉంది. 1987 లో శ్రద్ధా తండ్రి శక్తీ కపూర్ జూహూ లోనే ఒక  ఇల్లు కొన్నాడు. అప్పట్నుంచి శ్రద్ద ఆ ఇంట్లోనే ఉంటూ వస్తుంది. కానీ  ఇప్పుడు  ఇంటిని కాస్త విస్తరించి  రీ మోడలింగ్ చేయించాలని భావిస్తుంది. అందుకే అద్దెకి దిగబోతుందని అంటున్నారు.

ఇక శక్తీ కపూర్ 80 వ దశకంలో హిందీ చిత్ర సీమలో తిరుగులేని విలన్ గా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. స్త్రీ 2 రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తున్న వేళ శ్రద్ద అద్దె ఇంట్లోకి మారడం అనే న్యూస్ ఆకర్షణీయంగా మారింది. అదే టైంలో  వేరే కొత్త ఇల్లు కొనకుండా తండ్రి ఇంట్లోనే ఉండాలని అనుకోవడంపై పలువురు ఆమెని అభినందిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here