CM Chandrababu : ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఇన్నాళ్లూ నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందన్నారు. పేపర్ల నిండా కొద్ది మంది చేస్తున్న పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు రాస్తున్నారన్నారు. దీనివల్ల అందరికీ చెడ్డపేరు వస్తోందని అభిప్రాయపడ్డారు. మంత్రులు ఈ విషయంపై జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. మంత్రులు వారి పార్లమెంట్ పరిధిలో, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నేతలను గైడ్ చేయాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలదని సీఎం చంద్రబాబు అన్నారు.
Home Andhra Pradesh ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో అందరికీ చెడ్డపేరు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-cm chandrababu key...