2021 సంవత్సరం డిసెంబర్ నెలలో బాలయ్య, అల్లు అర్జున్ ( Balayya, Allu Arjun )సినిమాలు రెండు వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కావడం జరిగింది.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి.

 Pushpa The Rules Vs Balakrishna Details Inside Goes Viral In Social Media ,-TeluguStop.com

అయితే అఖండ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు సైతం విడుదల కాగా బన్నీ సినిమాలు మాత్రం గత మూడేళ్లలో అస్సలు విడుదల కాలేదనే సంగతి తెలిసిందే.

పుష్ప ది రూల్ సినిమా ( Pushpa the rule movie )ఈ ఏడాది డిసెంబర్ నెల 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.అయితే బాలయ్య బాబీ కాంబో మూవీ ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీన విడుదలవుతుందని అఖండ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరి వైరల్ అవుతున్న వార్త నిజమేనా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది.డిసెంబర్ 2వ తేదీ సోమవారం కాగా భారీ బడ్జెట్ సినిమాలను సోమవారం రిలీజ్ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరనే సంగతి తెలిసిందే.అందువల్ల బాలయ్య ,బాబీ( Balayya, Bobby ) మూవీ రిలీజ్ విషయంలో వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని అర్థమవుతుంది.బాలయ్య బాబీ కాంబో మూవీ షూట్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.

బాలయ్య బాబీ కాంబో సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇప్పటికీ ఒకింత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.బాలయ్య బాబీ కాంబో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బాలయ్య సినిమాల బడ్జెట్ 100 కోట్ల రూపాయలు క్రాస్ చేయడం కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here