యాపిల్ ‘ఇట్స్ గ్లోవ్టైమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో సెప్టెంబర్ 9న ఓ ఈవెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్లో నాలుగు కొత్త ఐఫోన్ 16 మోడళ్లను లాంచ్ చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల యాపిల్ తన మొదటి మ్యాక్ అభివృద్ధిని వేగవంతం చేస్తోందని, దీనిని మొదట తాజా ఐప్యాడ్ ప్రోతో ప్రవేశపెట్టిన ఎం4 చిప్‌ను కలిగి ఉందని అంటున్నారు. రాబోయే లైనప్‌లో మ్యాక్‌బుక్ బ్రో, మ్యాక్ మినీ, ఐమ్యాక్ తాజా వెర్షన్లు ఉంటాయని భావిస్తున్నారు, వీటన్నింటిలో ఎం4 చిప్ ఉంటుంది.