సోలోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నాని చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనను తాను ఒక స్టార్ హీరోగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్న ‘సరిపోదా శనివారం’ ( Saripoda Sanivaram )రేపు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని తీవ్ర స్థాయిలో నిర్వహించారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయింది.ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కూడా ప్రేక్షకులకు అమితంగా నచ్చడంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పటికే నాని( Nani ) కెరియర్ లో దసర, హాయ్ నాన్న సినిమాలు భారీ వసూళ్లను రాబట్టి మంచి విజయాలుగా నిలిచాయి.ఇక ఇప్పుడు ఈ సినిమాతో 100 కోట్ల మార్కును టచ్ చేసిన నాని ఈ సినిమాతో కూడా 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఒకవేళ ఈ సినిమాతో కనక సక్సెస్ అందుకుంటే నాని వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లను అందుకొని హ్యట్రిక్ సాధించిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.
ఇక ఇప్పటికే నాని లాంటి హీరో స్టార్ హీరోగా మారుతున్న క్రమంలో చాలామంది కొత్త దర్శకులకు అలాగే టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలను ఇస్తూ ముందుకు సాగుతున్నాడు.నాని కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నాని చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.మరి నాని అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయక తప్పదు…ఇక ఈ సినిమా లో విలక్షణ నటుడు అయిన ఎస్ జే సూర్య కీలక పాత్ర లో నటిస్తుండటం విశేషం…
.