వినియోగం 100 శాతం వృద్ధి..
ఇటాలియన్, లగ్జరీ ఫినిషెస్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. భారత పెయింట్స్ రంగంలో వీటి వాటా 0.5 శాతం లోపే. కానీ వినియోగం 100 శాతం వృద్ధి చెందిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘మార్కెట్లో ఎన్ని రకాలు వచ్చినా ఇటాలియన్, లగ్జరీ ఫినిషెస్‌కు ఆదరణ తగ్గలేదు. గోడలు, ఫ్లోరింగ్ అందంగా ఉండేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. హై ఎండ్ విల్లాస్, బంగ్లా, క్లబ్ హౌజ్, షోరూమ్స్, పబ్స్, హోటళ్లలో ఈ ఫినిషెస్ వాడుతున్నారు. కస్టమర్ కోరితే కస్టమైజ్డ్ షినిషెస్ అందిస్తాం. అన్ని ఉత్పత్తులూ పర్యావరణానికి అనుకూలం. ఎటువంటి హాని చేయవు. సహజ సిద్ధంగా లభించే ఇసుక, సున్నపు రాయితో తయారు చేస్తున్నాం. దశాబ్దాలపాటు మన్నికగా ఉంటాయి’ అని తెలిపారు.