నివాసానికి చేరుకున్న కవిత
హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, కవిత భర్త అనిల్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు కవిత. గురువారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కవిత సమావేశం అవుతారు.