బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు హస్తం శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమైంది. బుధవారం షాబాద్ లో కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు, కార్యకర్తలు… ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. ‘గో బ్యాక్ యాదయ్య..’ అంటూ నినాదాలు చేశారు.ఈ క్రమంలోనే కొందరు ఆయన వాహనంపైకి కోడి గుడ్లను విసిరారు.