Kopparthy Orvakal Industrial Hubs : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,596 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కోసం రూ.2,137 కోట్లు కేటాయించనున్నారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ సిటీకి రూ.8,860 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, సుమారు 54 వేల మందికి ఉపాధి లభించనుందని కేంద్రం తెలిపింది. 2,621 ఎకరాల్లో రానున్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కోసం రూ.2,786 కోట్ల వ్యయం చేయనున్నట్లు పేర్కొంది. ఇక్కడ రూ.12 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, సుమారు 45 వేల మందికి ఉపాధి దొరకనుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
Home Andhra Pradesh Industrial Hubs :ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్- పోలవరం నిధులు, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్...