2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో బంపర్ హిట్ అయిన పుష్ప ది రైజ్‍కు కొనసాగింపుగా పుష్ప 2 వస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. అందుకే తగ్గట్టే సుమారు సుమారు రూ.400కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కుతోందనే అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, యలమంచలి రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీప్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీరోల్స్ చేశారు.