రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డును ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హెల్త్ కార్డుల జారీకి సంబంధించి సెప్టెంబర్ 17 రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.