యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ( Young Tiger Jr.NTR, Koratala Siva )కాంబో మూవీ దేవర సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొనగా ఆ అంచనాలను కచ్చితంగా అందుకోవాల్సిన బాధ్యత ఈ సినిమాపై ఉంది.అయితే దేవర పక్కా ఇండస్ట్రీ హిట్టు బొమ్మ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర సినిమా( Devara movie ) నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ అభిమానులకు కిక్ ఇచ్చింది.
దేవర ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధం కావాల్సిందేనని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ఫ్యాన్స్ కు నచ్చేలా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండేలా కొరటాల శివ ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.
కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా సినిమా ఈ సినిమానే అనే సంగతి తెలిసిందే.తారక్ ఈ సినిమాకు భారీ స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అక్టోబర్ నెల నుంచి తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.తారక్ వార్2( War2 ) షూటింగ్ ఎంతవరకు పూర్తైందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.
వార్2 సినిమా 2025 సంవత్సరం ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానుందని సమాచారం అందుతోంది.వార్2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం తారక్ ఇమేజ్ ఎన్నో రెట్లు పెరగడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం వావ్ అనేలా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.