కోలీవుడ్ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్( Chian Vikram ) నటించిన పీరియాడికల్ చిత్రం తంగలాన్( Tangalan ).ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి విడుదల అయిన ఈ మూవీ రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టింది.
డైరెక్టర్ పా రంజిత్ ( Director Pa Ranjith )ఈ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించారు.
ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులతో కలిసి సక్సెస్ మీట్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్ కు హాజరైన అభిమానులకు హీరో విక్రమ్ స్వయంగా భోజనం వడ్డించారు.
స్టార్ హీరో అయి ఉండి సింపుల్ గా కనిపించారు.తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో కనిపించి సందడి చేశారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విక్రమ్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.విక్రమ్ సింప్లిసిటీకి మెచ్చుకోవడం తో పాటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.విక్రమ్ రియల్లీ గ్రేట్ చాలా సింపుల్ సిటీ గా ఉంటారు.అందరితో కలిసి పోతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.మరోవైపు తంగలాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ దూసుకుపోతోంది.