ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు (Nadiminti Narasinga Rao) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.

వెండితెర మీద, బుల్లితెర మీద తనదైన ముద్రవేశారు నరసింగరావు. ‘గులాబీ’, ‘అనగనగా ఒక రోజు’ వంటి విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. ‘తెనాలి రామకృష్ణ’, ‘వండర్ బాయ్’, ‘లేడీ డిటెక్టివ్’, ‘అంతరంగాలు’ వంటి పలు సీరియల్స్ కి రైటర్ గా వర్క్ చేశారు.

 

డిజిటల్ రంగంలోనూ తన మార్క్ చూపించారు నరసింగరావు. ముఖ్యంగా ‘తెలుగువన్’తో ఆయనకు ఎంతో అనుబంధముంది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. నరసింగరావును ఎంతగానో ప్రోత్సహించి డిజిటల్ రంగంలోనూ తన ముద్ర పడేలా చేశారు. విభిన్న కాన్సెప్ట్ తో రూపొందిన పలు షార్ట్ ఫిల్మ్ లకు నరసింగరావు రచయితగా వ్యవహరించారు. అలాగే ఈ తరానికి భారతదేశ చరిత్ర, రాజుల గొప్పతనం తెలిసేలా.. పలు అద్భుతమైన వీడియోలు రూపొందించారు.

నరసింగరావు మృతి పట్ల తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సంతాపం ప్రకటించారు. తనతో, తెలుగువన్ తో నరసింగరావు గారికి ఎంతో అనుబంధముందని గుర్తు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here