ఎన్నో అధ్బుతమైన పాత్రలని అవలీలగా పోషించి, అసలు సిసలు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా, నేటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా నిలిచిన మహానటుడు నటవిరాట్ రావుగోపాలరావు(rao gopal rao)ఆయన నటవారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి విలక్షణమైన పాత్రలని పోషిస్తు వారసత్వానికి బ్రాండ్ ని తీసుకొచ్చిన నటుడు రావు రమేష్. తాజాగా సోషల్ మీడియాలో ఆయన రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదేంటో చూద్దాం.
రావు రమేష్ (rao ramesh)లేటెస్ట్ గా మారుతినగర్ సుబ్రమణ్యం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైటిల్ లోని సుబ్రమణ్యం ఆయనే. దాన్ని బట్టి మూవీలో రావు రమేష్ ఇంపార్టెన్స్ ని అర్ధం చేసుకోవచ్చు. పైగా తన అధ్బుతమైన నటనకి మూవీ హిట్ కూడా అయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు. వాటిల్లో ఆయన మాట్లాడుతు రోజుకి నాలుగున్నర లక్షల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న సందర్బాలు ఉన్నాయి. పైగా నేను తీసుకునే ప్రతి రూపాయి వైట్ రూపంలోనే ఉంటుంది. ట్యాక్స్ కూడా కడుతున్నానని చెప్పుకొచ్చాడు. అంటే దీన్ని బట్టి మారుతీ నగర్ కి రావు రమేష్ నాలుగున్నర లక్షలు తీసుకున్నాడనే విషయం అర్ధమయ్యింది.
అదే విధంగా మరికొన్ని విషయాలు కూడా వెల్లడించాడు. అన్ని సినిమాలకి ఒకే తరహా రెమ్యునరేషన్ ఉండదు. మూవీ స్టోరీ, అందులో క్యారెక్టర్ ని బట్టి రెమ్యునరేషన్ ని ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే బడా ప్రాజెక్ట్స్ లలో చేసినపుడు కొంచం ఎక్కువ వస్తుంది. అయితే క్యారెక్టర్ నచ్చితే మాత్రం రెమ్యునరేషన్ తక్కువ అయినా కూడా చేస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే పాన్ ఇండియా ట్రెండ్ పుణ్యమా అని అధర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్స్ నా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఏ క్యారెక్టర్ కి ఎవరిని తీసుకోవాలనేది దర్శక, నిర్మాతల ఛాయస్. వారికి నచ్చిన యాక్టర్స్ ని తీసుకునే హక్కు వారికుంటుంది. అయినంత మాత్రాన నాకు అవకాశాలు రాకపోవడం లేదు. కానీ నేనే సెలక్టివ్ గా చేస్తున్నానని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.