మలయాళ చిత్ర సీమలో మహిళా నటీమణులపై  లైంగిక ఆరోపణలు జరుగుతున్నాయనేది నిజమని జస్టిస్ హేమ కమిటీ నిర్ధారించిన విషయం అందరకి తెలిసిందే. పైగా అందుకు నైతిక బాధ్యత వహిస్తు స్టార్ హీరో మోహన్ లాల్(mohan lal)మూవీ ఆఫ్ మలయాళం ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేసాడు. ఈ విషయాన్నంతా యావత్తు భారతీయ సినీ ప్రేక్షకులు గమనిస్తునే  ఉన్నారు. అదే టైంలో స్వతహాగా  మలయాళీ అయిన  సమంత(samantha)ఎందుకు ఈ విషయం మీద మాట్లాడటం లేదనే చర్చ కూడా వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సామ్  తన స్పందనని తెలియచేసింది. అంతే కాదు సరికొత్త విషయాలని కూడా వెల్లడి చేసింది.

డబ్ల్యుసిసి.. ఉరఫ్ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్ వల్లే  జస్టిస్ హేమ కమిటీ మలయాళ చిత్ర పరిశమ్రలో నటీమణులపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో తమ నివేదికని ఇవ్వగలిగింది. ఇండస్ట్రీలోని  మహిళలకి సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం డబ్ల్యుసిసి ఎప్పటినుంచో  అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. నేను కూడా  చాలా సంవత్సరాల నుంచి  ఆ సంస్థ పని తీరుని గమనిస్తున్నానని సామ్ చెప్పుకొచ్చింది. అలాగే  లొకేషన్స్ లో సురక్షితమైన, గౌరవమైన పని ప్రదేశాలు నటీమణుల కనీస అవసరాలు. వీటికోసం  ఇప్పటికి ఎంతో మంది పోరాటం చేస్తున్నారు.కానీ వారి ప్రయత్నాలు ఫలించడంలేదు. హేమ కమిటీ నివేదిక దృష్ట్యా ఇప్పటికైనా వాటిపై నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడంతో పాటుగా  ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ లో ఉన్న తన స్నేహితులకి, సోదరిమనులకి తన కృతజ్ఞలు కూడా తెలిపింది. 

 ఇక సామ్ సినీ కెరీర్  విషయానికి  వస్తే  ప్రస్తుతం  సిటాడెల్ హానీ బన్నీ(citadel honey bunny)అనే  హిందీ వెబ్ సిరీస్ లో ఒక పవర్ ఫుల్ పాత్రలో చేసింది.ఈ సిరీస్ నవంబర్ 7 న అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. అలాగే మా ఇంటి బంగారం అనే  ఒక మూవీని కూడా స్టార్ట్ చేసింది. పైగా సామ్ నే ప్రొడ్యూస్ కూడా  చేస్తుంది.సిల్వర్ స్క్రీన్ మీద చివరగా  విజయ్ దేవరకొండ(vijay devarakonda)తో కలిసి ఖుషి(khushi)లో మెరిసింది. గత సంవత్సరం సెప్టెంబర్ 1 న  విడుదల అయ్యింది. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here