మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్ పల్లి సమీపంలోని ఆదర్శనగర్లో పేదల ఇళ్లను అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు హైడ్రా తరహాలో కూల్చి వేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పట్టా భూముల్లో కట్టుకున్న ఇళ్లను కూల్చివేతపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున బుల్‌డోజర్లతో ఎలాంటి నోటీసు లేకుండా కూల్చి వేతలు చేపట్టారని వాపోయారు.