మలయాళం సినిమా ఇండస్ట్రీలో ‘మీటూ’ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. పలువురు ప్రముఖ నటులు, డైరెక్టర్లపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మోహన్ లాల్ రాజీనామా చేశారు. మాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను బహిరంగపర్చిన తర్వాత పలువురు మహిళా నటులు తమకు ఎదురైన దారుణ పరిస్థితులపై గళం విప్పుతున్నారు. తాజాగా నటి సోనియా మల్హర్ మాట్లాడారు. అవకాశం ఇవ్వాలంటే పడుకోవాలని కోరినట్లు వెల్లడించారు. కానీ అందుకు తాను తిరస్కరించానని చెప్పారు. రెండు రోజు ఆ రోజు అలా అడిగిన హీరో పేరు సైతం బయటపెడుతానని తెలిపారు.