కొత్త జియో టీవీ + ఆఫర్లు

జియో టీవీ + లో ప్రారంభించనున్న కొత్త ఆఫర్ల గురించి, ముకేశ్ అంబానీ కుమారుడు, రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ వివరించారు. ‘‘జియో టీవీ + మీ వినోదాన్ని – లైవ్ టీవీ, ఆన్-డిమాండ్ షోలు, మరిన్ని యాప్ లను ఉపయోగించడానికి సులభమైన ప్లాట్ ఫామ్ తో వస్తోంది. జియోటివి + తో, మీరు 860 కి పైగా లైవ్ టివి ఛానెళ్లను వీక్షించవచ్చు. అద్భుతమైన హైడెఫినిషన్ లో అన్ని ప్రముఖ ఛానెల్స్, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్ స్టార్ వంటి ఓటీటీల నుండి ఉత్తమ కంటెంట్ మొదలైనవన్నీ ఒకే చోట లభిస్తాయి. సూపర్ ఫాస్ట్ ఛానల్ స్విచ్చింగ్ అనుభవం కోసం జియో టీవీ+ ను ఆప్టిమైజ్ చేశాం’’ అని ఆకాశ్ అంబానీ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here