తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 29 Aug 202403:49 AM IST
Telangana News Live: Nizamabad Marriage: పెళ్లి విందులో రగడ, పోలీస్ స్టేషన్‌కు చేరిన మటన్ పంచాయితీ, నిజామాబాద్‌లో ఘటన..
- Nizamabad Marriage: నిజామాబాద్ నవీపేటలో మటన్ ముక్కల పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెళ్ళి విందులో మటన్ వడ్డించలేదంటూ మొదలైన రగడ కాస్త ఇరు వర్గాలు కొట్లాటకు దిగే వరకు వెళ్లింది. వధువరుల బంధువులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఈ గొడవ చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది.
Thu, 29 Aug 202402:21 AM IST
Telangana News Live: Sangareddy Crime: నారాయణఖేడ్‌లో దారుణం.. మద్యం మత్తులో మతిస్థిమితం లేని వృద్ధురాలి పై అత్యాచారం
- Sangareddy Crime: కామం తో కళ్ళు మూసుకుపోయిన ఒక 35 సంవత్సరాల వ్యక్తి, మానసిక వికలాంగురాలైన, ఓ 60 సంవత్సరాల వృద్ధురాలు పై అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఒక షాప్ ముందు నిద్రిస్తున్న ఆ మహిళపై అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Thu, 29 Aug 202401:53 AM IST
Telangana News Live: Sirisilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాటు తుపాకుల తయారీ కలకలం.. ముగ్గురు నిందితుల అరెస్ట్
- Sirisilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపాయి. తుపాకులను తయారు చేసే వ్యక్తితో పాటు వాటిని ఉపయోగించే మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కంట్రీ మేడ్ తుపాకులతో పాటు మూడు ఐరన్ బారెల్, 4 ట్రిగ్గర్లు ముడిసరుకులు స్వాధీనం చేసుకున్నారు.