నంద్యాల ఎపిసోడ్ దగ్గర్నుంచి సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక రేంజ్ వార్ జరుగుతూనే ఉంది. ఇక ట్రోల్ల్స్ కైతే అడ్దు అదుపు లేకుండా పోతుంది. కాకపోతే ఇద్దరి కంబైన్డ్ ఫ్యాన్స్ మాత్రం మెగా, అల్లు ఇష్యు లోకి పొలిటికల్ పేటియం గ్యాంగ్ చేరిందనే వాదనని తెర మీదకి తెస్తున్నారు. ఈ టైం లో పూనమ్ కౌర్ ఒక పిక్ షేర్ చేసింది. దీంతో చాలా రోజుల తర్వాత పూనమ్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
పూనమ్ రీసెంట్ గా ఎక్స్ వేదికగా ఒక పిక్ ని షేర్ చేసింది. అది అలాంటి ఇలాంటి పిక్ కాదు. అందులో అల్లు అర్జున్ తో పాటు స్నేహ రెడ్డి, పూనమ్ కూడా ఉంది. స్నేహ, పూనమ్ లు ప్రేయర్ చేస్తుండగా బన్నీ ఉత్సుహకతో కూడిన టెన్షన్ తో ఉన్నాడు.క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పటి పిక్ అనే విషయం అర్ధమవుతుంది. అలాగే ఓల్డ్ పిక్ అనే విషయం అర్ధమవుతున్నా కూడా ఎప్పటిదనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.ఇక ఆ పిక్ కి ప్రేమ, ప్రార్థన, సామరస్యం అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో పాటుగా లవ్ ఈజ్ ది ఆన్సర్ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా జోడించింది.
జనరల్ గా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్లపై పూనమ్ ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటుంది.కాకపోతే పవన్ విషయంలో తన వైఖరి మీద ఫుల్ గా క్లారిటీ లేకపోయినా త్రివిక్రమ్ మీద మాత్రం ఒక రేంజ్ ఫైర్ ని వ్యక్తం చేస్తుంది. ఇక పవన్, బన్నీ మ్యాటర్ లో బన్నీ కి తన మద్దతుని ఆ పిక్ ద్వారా తెలియచేస్తుందని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.