నల్లగొండ జిల్లా:తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( Revanth Reddy )నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తుందని మాడ్గులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వేణు గోపాల్ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో అర్హులైన రైతులు ఉన్నప్పటికీ రుణమాఫీ జరుగలేదన్నారు.రైతు రుణమాఫీ విషయంలో రుణమాఫీ రాలేదని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని,మాడ్గులపల్లి, ఆగామోత్కుర్,వేములపల్లి,కన్నేకల్ గ్రామాల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు, వేములపల్లి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ( State Bank of India )లలో వ్యవసాయ రుణాలు పొందిన రైతుల సమగ్ర సమాచారాన్ని సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులలో ఉంచడం జరిగిందన్నారు.

 Loan Waiver Is Applicable To All Eligible Farmers, Revanth Reddy, Loan Waiver-TeluguStop.com

ఈ జాబితాలో పేరు ఉండి రుణమాఫీ పొందని రైతులు పొందుపరిచిన జాబితాలోని సమగ్ర సమాచారంతో తమ క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారికి దరఖాస్తులను అందజేయాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో పలురకాల సాంకేతిక కారణాలతో అర్హులైన రైతుల పేర్లు నమోదు కాలేదని, రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందించడం కోసం ప్రయత్నం చేస్తుందన్నారు.

రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు పన్నుతున్న కుట్రలో రైతులు పడి తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా వ్యవసాయ అధికారులకు సమగ్ర సమాచారంతో దరఖాస్తు చేసి రుణమాఫీ పొందాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here