మ్యాచ్‌కి ముందు 12 మందితో కూడిన జట్టుని ప్రకటించిన పాకిస్థాన్ అందులో షాహిన్ అఫ్రిది పేరుని చేర్చలేదు. వన్డే, టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న షాహిన్ అఫ్రిది, టెస్టుల్లో మాత్రం గత కొంతకాలంగా ఘోరంగా విఫలమవుతున్నాడు.

రావల్పిండి వేదికగానే ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన తొలి టెస్టులో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దాంతో ఈరోజు నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌‌ను డ్రాగా ముగించాలని ఆతిథ్య జట్టు ఆశిస్తోంది. దాంతో తమ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది‌ని కూడా పక్కన పెట్టి సాహసం చేస్తోంది.

వాస్తవానికి సొంతగడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. స్వదేశంలో లేదా విదేశాల్లో ఒక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఒక జట్టుని ఓడించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here