ఇదే కాలేజీలో ఫైనలియర్ బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థి బాత్రూమ్లలో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అతనికి ఓ విద్యార్థిని సహకరించినట్టు చెబుతున్నారు. వాటిని ఆన్లైన్లో విక్రయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రహస్య చిత్రీకరణ చేసిన విద్యార్థి ఓ రాజకీయ పార్టీ నాయకుడి తనయుడు కావడంతో వారం రోజుల క్రితమే విషయం వెలుగు చూసినా యాజమాన్యం చూసిచూడనట్టు వదిలేసిందని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు, విద్యార్థుల ఆందోళనలను ఎక్స్‌లో వైరల్‌గా మారాయి.
Home Andhra Pradesh ఇంజనీరింగ్ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు? గుడ్లవల్లేరులో అర్థరాత్రి ఉద్రిక్తత-secret cameras in engineering college...