మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ‘దేవర’ (Devara). అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. ఆ రెండు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సెకండ్ సింగిల్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది.

‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘ఫియర్ సాంగ్’ (Fear Song), సెకండ్ సింగిల్ గా ‘చుట్టమల్లే సాంగ్’ (Chuttamalle Song) విడుదలయ్యాయి. ఫియర్ సాంగ్ మాస్ ని ఒక ఊపు ఊపగా.. చుట్టమల్లే మెలోడీ సాంగ్ అన్ని వర్గాల వారిని అలరిస్తూ దూసుకుపోతోంది. యూట్యూబ్ లో ఇప్పటికే ఈ సాంగ్ 125 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేసి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. యూట్యూబ్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ రీల్స్ రూపంలో చుట్టమల్లే సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. (Devara Songs)

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మిగతా సాంగ్స్ విడుదలకి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో థర్డ్ సింగిల్, మూడు వారంలో ఫోర్త్ సింగిల్ విడుదలయ్యే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here