బండ్ల గణేష్(bandla ganesh)ఎవరని అడిగితే ప్రముఖ నటుడు,నిర్మాత అని చెప్పేవారి కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)కి భక్తుడు అని  చెప్పే వాళ్లే ఎక్కువ. పైగా బండ్ల గణేష్ కి కూడా అలా పిలిపించుకోవడమే చాలా ఇష్టం. పవన్, బండ్ల కాంబోలో తీన్ మార్, గబ్బర్ సింగ్ లు రాగా గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ ని కొట్టింది. ఇప్పడు ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 2  పవన్ బర్త్ డే సందర్భంగా రెండు తెలుగు రాష్టాల్లో నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన  కొన్ని వ్యాఖ్యలు  పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త కనువిప్పు ని కలగచేస్తున్నాయి.

గబ్బర్ సింగ్(gabbar singh)రీ రిలీజ్ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.అందులో హరీష్ శంకర్(harish shankar)తో పాటు బండ్ల గణేష్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పవన్ అభిమానులని ఉద్దేశించి బండ్ల మాట్లాడుతు ఫ్యాన్స్ కి  భయపడే కొంతమంది థియేటర్ ఓనర్స్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి థియేటర్స్ ఇవ్వడంలేదు. లోపల అల్లరి చేస్తారని కుర్చీలు పగల కొడతారనే కారణంతోనే ఇవ్వడం లేదు. కాబట్టి అభిమానులెవరు అలా ప్రవర్తించద్దు. ఎందుకంటే పవన్ ఇప్పుడు సినిమా హీరోనే కాదు పొలిటికల్ హీరో కూడా. మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.కాబట్టి ఆయనకీ చెడ్డపేరుని తీసుకురావద్దని కోరాడు.అదే విధంగా అభిమానులెవరు అల్లరి చెయ్యరని, ఉదయాన్నే గుడికి వెళ్లొచ్చి సినిమాకి వస్తారు, థియేటర్లు ఇవ్వండని   ఓనర్స్ కి కూడా  విజ్ఞప్తి చేసాడు.

 ఇక ఇదే కార్యక్రమంలో ఒక యాంకర్ బండ్ల తో ఒక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో  పవన్ ని పోల్చుతూ పవన్ ని తక్కువ చేసి ఎందుకు మాట్లాడారని అడిగింది.ఇక అంతే పవన్ మీద తనకున్న అభిమానాన్ని మరోసారి చాటి చెప్పాడు.నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పవన్ ని తక్కువ చేసి మాట్లాడటం జరగదు. చివరకి నా శవం కూడా అలా మాట్లాడదని  చెప్పుకొచ్చాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here