పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సినిమా ఏదనే ప్రశ్నకు ఓజీ సినిమా( OG Movie ) పేరు జవాబుగా వినిపిస్తుంది.సుజీత్( Sujeeth ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
సెప్టెంబర్ నెల 27వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పవన్ పొలిటికల్ గా బిజీ కావడం వల్ల వాయిదా పడింది.
ఓజీ సినిమా మార్చి నెల 27వ తేదీన రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
ఉగాది పండుగ( Ugadi Festival ) కానుకగా ఈ సినిమా విడుదల కానుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఇప్పటికే ఓజీ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్స్ కేటాయిస్తే మాత్రం ఓజీ షూట్ వేగంగానే పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.విజయవాడలోనే ఈ సినిమా షూట్ జరగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఓజీ రిలీజ్ డేట్ ను ( OG Release Date ) త్వరలో ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఓజీ మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయనుందో చూడాలి.
మార్చి 27వ తేదీ ఓజీ మూవీకి బెస్ట్ డేట్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.ఓజీ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సైతం స్పెషల్ గా ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఓజీ 2025 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఓజీ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.