CM Chandrababu : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం సమీస్తున్నారు. మరోసారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలన్నారు.
Home Andhra Pradesh భారీ వర్షాలుంటే ముందు రోజే సెలవుపై ప్రకటన, ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు- సీఎం చంద్రబాబు...