సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు రాధిక(Radhika Sarathkumar)ఎనభైయ్యవ దశకంలో తన అధ్బుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించింది. ముఖ్యంగా చిరు(chiranjeevi)తో కలిసి చేసిన సినిమాల ద్వారా అయితే కుర్రకారు కలల రాణిగా కూడా మారిపోయింది.ఇక దేశమంతటా మహిళా నటీమణులపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి చర్చ జరుగుతున్న వేళ రాధిక చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు అందరిలో సరికొత్త అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి.
నలభై ఆరు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు మహిళలకు లైంగిక వేధింపులు ఎదురుకావడం దురదృష్ట కరం. అన్ని భాషల్లోను మహిళలు ఇలాంటి సమస్యలకి గురవుతున్నారనేది నా భావన అని కొన్నాళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది.కేరళలో షూటింగ్ ముగించుకొని వెళ్తుండగా కొంత మంది మగవాళ్ళు ఫోన్ చూస్తు నవ్వుకుంటున్నారు.వాళ్ళ ఎక్సప్రెషన్స్ ని బట్టి ఏదో వీడియో చూస్తున్నారని అర్ధమయ్యింది.దాంతో చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి వాళ్లంతా ఏం చూస్తున్నారని అడిగాను. దాంతో కారవాన్ లో సీక్రెట్ కెమెరాలని పెట్టి మహిళల ప్రయివేట్ వీడియోలు చిత్రీకరించి చూస్తున్నారని తెలిసింది.అంతే ఒక్కసారిగా షాక్ కి గురయ్యి చిత్ర బృందానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా కారవాన్ లో ఎవరైనా కెమెరాలు పెడితే తగిన బుద్ది చెప్తానని టీం కి వార్నింగ్ ఇచ్చాను.అసలు ఆ ఘటన తర్వాత కారవాన్ ఉపయోగించాలంటేనే భయం పట్టుకుందని కూడా చెప్పుకొచ్చింది.
ఇక రాధిక చెప్పిన ఈ విషయంతో ఒక్కసారిగా భారతీయ చిత్ర పరిశమ్ర ఉలిక్కి పాటుకి గురయ్యింది. కారవాన్ ని హీరోలతో పాటు హీరోయిన్ల తో పాటు పేరెన్నికగన్న నటీమణులు ఉపయోగిస్తారు. దుస్తులు మార్చుకోవడంతో పాటుగా భోజనం చెయ్యడం, విశ్రాంతి తీసుకోవడం లాంటివి చేస్తుంటారు.ఒక రకంగా చెప్పాలంటే షూట్ గ్యాప్ లో నటీమణుల ప్రైవేట్ ప్లేస్ కూడా కారవాన్ నే.